బిజినెస్

సమగ్ర వస్తు సేవా పన్ను కింద రూ. 21,142 కోట్ల చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: సమగ్ర వస్తు సేవాపన్ను కింద జూన్ 16వ తేదీ వరకు రూ.21,142 కోట్ల సొమ్మును చెల్లించినట్లు కేంద్రం ప్రకటించింది. ఐజిఎసీటీ కింద రూ.21,1422 కోట్లు, ఆర్‌ఎఫ్‌డీ-01ఏ కింద రూ.16,920 కోట్లను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు రాష్ట్రప్రభుత్వాలకు మంజూరు చేసింది. బుధవారం ఈ వివరాలను వాణిజ్య శాఖ మంత్రి సిఆర్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. ఎగుమతిదార్లకు రిఫండ్ క్లైమ్స్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ రిఫండ్ పక్షోత్సవాలను ఈ ఏడాది మార్చి, జూన్ నెలల్లో నిర్వహించామన్నారు. రిఫండ్ చెల్లింపుల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.