బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గిన ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం (రెరా) అమలు కారణంగా గత సంవత్సరం దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగ నియామకాలు ఎనిమిది శాతం తగ్గాయి. గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ ఇండియా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. స్థిరాస్తి రంగంలో గత సంవత్సరం జాబ్ సెర్చెస్ (ఉద్యోగాలు కావాలని కోరుకునే వారి సంఖ్య) ఎనిమిది శాతం పెరిగినప్పటికీ, ఉద్యోగ నియామకాలు మాత్రం ఎనిమిది శాతం పడిపోయాయి. రెరా అమలు వల్ల స్థిరాస్తి రంగంలో మరింత నియంత్రణ, పారదర్శకత పెరిగింది. ఫలితంగా ఈ రంగంలో ఉద్యోగాలు చేయాలని కోరుకునే వారిలో విశ్వాసం పెరిగింది. అయితే, ఉద్యోగాల నియామకాలు మాత్రం తగ్గాయి. ‘రెరా అమలు తరువాత స్థిరాస్తి రంగం ఇంకా కోలుకుంటుండగా, అంగీకార ఒప్పందాలు, నియంత్రణ వంటి చర్యల కారణంగా వివిధ స్థాయిలలో ఉద్యోగాల కల్పన అవకాశాలు పెరుగుతాయనే అంచనా ఉంది’ అని ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశికుమార్ పేర్కొన్నారు. అయితే, ఉద్యోగాల కల్పనలో నెలకొన్న మాంద్యం ప్రభుత్వం రెరాను అమలు చేసిన తరువాత స్థిరాస్తి రంగం కోలుకోవడానికి కొంత సమయం తీసుకుంటున్నదనే విషయాన్ని సూచిస్తోందని ఇండీడ్ ఇండియా నివేదిక పేర్కొంది. స్థిరాస్తి రంగంలో ఎక్కువ మంది ఉద్యోగాలు కోరుకుంటున్న ప్రాంతాలలో నోయిడా మొదటి స్థానంలో ఉందని ఇండీడ్ ఇండియా గణాంకాలు వెల్లడించాయి. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయి తరువాత స్థానంలో ఉంది. బెంగళూరులోని సిలికాన్ వ్యాలీ సిటీ మూడో స్థానంలో ఉంది. స్థిరాస్తి రంగంలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న వారిలో ఎక్కువ మంది 36-45 ఏళ్ల మధ్య వయసు గల వారు ఉన్నారని ఇండీడ్ ఇండియా నివేదిక వెల్లడించింది.