బిజినెస్

కామర్స్, ఫైనాన్స్ విభాగాల్లో ఉపాధి కల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 20: కామర్స్, ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు నైపుణ్యతా శిక్షణ ఇచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసి), నేషనల్ స్టాక్ ఎక్సేంజి అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీఎస్‌ఎస్‌డీసి ఇన్‌చార్జి ఎండి, సీఈఒ ఎం వరప్రసాద్ సమక్షంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్‌కుమార్, నేషనల్ స్టాక్ ఎక్సేంజి అకాడమీ తరుపు సంస్థ ఉపాధ్యక్షుడు అచల్ జైస్వాల్ ఒప్పందపత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో కామర్స్, ఫైనాన్స్ విభాగాలకు గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు రెగ్యులర్ కోర్సులతో పాటు నైపుణ్యతా శిక్షణ ఇచ్చేందుకు ఎన్‌ఎస్‌ఈ సంస్థ ముందుకొచ్చింది.
ఈ ఒప్పందంలో భాగంగా అకాడమీ అందిస్తున్న కోర్సులు ఏపీ ఎస్‌ఎస్‌డీసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంప్లాయిబులిటీ స్కిల్స్ సెంటర్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు కేపిటల్ మార్కెట్ విభాగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) వరప్రసాద్ వెల్లడించారు.