బిజినెస్

స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: కేంద్రంలో 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 80 శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో స్విస్ బ్యాంకులో 34.5 శాతం భారతీయుల డబ్బు నిల్వలు తగ్గాయని పేర్కొన్నారు. ఈ విషయమై బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ పేర్కొన్న తాజా నివేదికను ఆయన ప్రస్తావించారు. 2017లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 50 శాతం పెరిగినట్టు గతనెలలో వచ్చిన వార్షిక నివేదిక పూర్తి సత్యదూరమని ఆయన అన్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయు నగదు నిల్వలు 1.01 బిలియన్లు (7వేల కోట్లు) మూలుగుతున్నట్టు గత నెలలో వచ్చిన నివేదిక పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి మూడేళ్లపాటు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు. 2016లో స్విస్ బ్యాంకులో భారతీయుల డబ్బు 800 మిలియన్ డాలర్లు ఉండగా, 2017లో 524 డాలర్లకు తగ్గుముఖం పట్టిందని, అంటే 34.5 శాతం నిల్వలు తగ్గినట్టేనని ఆయన అన్నారు. అదేవిధంగా 2013లో 2.6 బిలియన్ డాలర్లు 2016 నాటికల్లా 2.3 బిలియన్ డాలర్లకు తగ్గాయని, 2015లో 1.4 బిలియన్ డాలర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు నిల్వలపై అక్కడి మీడియాలో వచ్చే వార్తలను ప్రాతిపదికగా చేసుకుని స్విస్ జాతీయ బ్యాంకు నివేదిక ఇస్తోందని స్విస్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించిందుకేనని మంత్రి పే ర్కొన్నారు. మీడియాలో వచ్చిన తప్పుడు అంశాలను ఆ ధారంగా చేసుకుని నివేదిక విడుదల చేసి, ప్రజల్లో అపోహలు సృష్టించడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.