బిజినెస్

దిగుమతుల కట్టడికి ప్రత్యేక టాస్క్ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: వివిధ దేశాల నుంచి వచ్చిపడుతున్న దిగుమతులను కట్టడి చేసి, సాధ్యమైనంత వరకూ వాటిని తగ్గించడానికి అవసరమైన చర్యలను సూచించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వస్తువులకు ప్రత్యామ్నాయాలను గురించి, దేశంలోనే వాటి ఉత్పాతకతను పెంచడానికి తీసుకుంటున్న చర్యలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 384.3 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాని విలువ 465.5 బిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాలు వ్యవసాయక ఉత్పత్తులను నిషేధించాయని పేర్కొన్నారు. శీతలీకరణ చేసిన చిన్న రొయ్యలులను 2016 డిసెంబర్ నుంచి, కల్చర్డ్ ఫిష్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సౌదీ అరేబియా నిషేధించిన విషయాన్ని ప్రస్తావించారు. అదే విధంగా భారత దేశం నుంచి ఫ్రోజెన్ రొయ్యల దిగుమతిని కువైట్ నిషేధించిందని అన్నారు. థాయిలాండ్, మెక్సికో వంటి వివిధ దేశాలు కూడా పలు వ్యావసాయక, ఆహారోత్పత్తుల దిగుమతులపై నిషేధాన్ని విధించాయని అన్నారు. వేగంగా వ్యాపించే గుణం ఉన్న మైయోనెక్రోసిస్ వైరస్ (ఐఎంఎన్‌వీ) రోగాలకు అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నాయని అన్నారు. మన దేశంలోనూ అలాంటి చర్యలే అవసరమని చెప్పారు. కొన్ని రకాలైన రోగ కారక క్రిములను దేశంలోకి రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కూడా కొన్ని దేశాలు దిగుమతులను కట్టడి చేస్తున్నాయని అన్నారు. ఈ అంశాలను, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సత్వరం చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలను ఇవ్వడానికి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.