బిజినెస్

వడ్డీ రేట్లపై మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మూడు రోజుల కీలక సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన, ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లపై విస్తృత స్థాయిలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పెట్రో ధరల పెరుగుదల, ఐదు శాతానికి చేరుకున్న ఆర్థిక మాంద్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ దృష్టి కేంద్రీకరించడం విశేషం. ప్రతి రెండు నెలలకోసారి ఎంపీసీ సమావేశం కావడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే మూడు రోజుల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. అన్ని కోణాల్లోనూ చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను ఆగస్టు ఒకటిన వెల్లడిస్తారు. ఆర్థిక మాంద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, జూన్‌లో సమావేశమైనప్పుడు, స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటను 0.25 శాతం పెంచింది. దీనితో వడ్డీ రేటు 6.25 శాతానికి చేరింది. జూన్‌లో పెట్రో ధరలు గతంలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకోవడం కూడా ఆర్‌బీఐ నిర్ణయానికి ఒక కారణం. అయితే, రెండు నెలల వ్యవధిలో పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించలేదు. ముడి చమురు ధరలు పెరుగుతునే ఉన్నాయి. ద్రవ్యోల్బణం రేటు కూడా అందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్లు ఏ శాతం పెరుగుతాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.