బిజినెస్

7నెలల గరిష్ఠానికి కీలక రంగం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: దేశ వౌలిక సౌకర్యాల రంగం ఈ సంవత్సరం జూన్ నెలలో గత సంవత్సరం జూన్‌తో పోలిస్తే 6.7 శాతం వృద్ధి చెందింది. ప్రభుత్వం మంగళవారం వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏడు నెలల్లో అత్యంత వేగంగా సాధించిన వృద్ధి ఇది. వౌలిక సౌకర్యాల రంగం గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం మేలో 4.3 శాతం వృద్ధి చెందింది.
అంటే మే నెలతో పోలిస్తే జూన్ నెలలో వౌలిక సౌకర్యాల రంగం వృద్ధి చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వౌలిక సౌకర్యాల రంగం వృద్ధి గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.2 శాతంగా ఉంది. బొగ్గు, ముడి చమురు, విద్యుత్తు వంటి ఎనిమిది కీలక రంగాలు వౌలిక సౌకర్యాల రంగంలోకి వస్తాయి. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో సుమారు 40 శాతం వౌలిక సౌకర్యాల రంగమే ఆక్రమించింది.