బిజినెస్

ఏడోరోజూ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 31: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం సెషన్‌లో బలహీనంగా సాగినప్పటికీ, చివరలో కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాలతో ముగియడమే కాకుండా సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెషన్ ముగిసే సమయం ఆసన్నమవుతున్న కొద్దీ రిల్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్ షేర్లలో కొనుగోళ్లు పెరిగి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మంగళవారం సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 37,606.58 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ వరుసగా ఏడో సెషన్ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా మంగళవారం 36.95 పాయింట్లు (0.33 శాతం) పుంజుకొని, వరుసగా నాలుగో సెషన్ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,356.50 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ సోమవారం నాటి గరిష్ఠ ముగింపు 37,494.40 పాయింట్లను అధిగమించి, 112.18 పాయింట్ల (0.30 శాతం) ఎగువన 37,606.58 పాయింట్ల వద్ద మంగళవారం ముగిసింది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, ఆసియన్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొనడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. దీంతో సెషన్‌లో ఎక్కువ భాగం లావాదేవీలు ప్రతికూల జోన్‌లోనే సాగాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయం బుధవారం వెలువడనుండటం కూడా మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పూనుకోవడానికి కారణమయిందని బ్రోకర్లు చెప్పారు. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల విలువ పడిపోయింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్ల విలువ 3.23 శాతం వరకు తగ్గింది. అయితే, డాలర్‌తో పోలిస్తే రూపాయి కోలుకోవడం, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) కొనుగోళ్లకు పూనుకోవడం, కొన్ని బ్లూచిప్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటం వల్ల చివరలో ఎంపిక చేసిన షేర్లు రాణించాయి. దీంతో కీలక సూచీలు పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ అత్యధికంగా 3.14 శాతం లాభపడి, రికార్డు గరిష్ఠ స్థాయి రూ. 1,185.85 వద్ద ముగిసింది. దీంతో రిల్ టీసీఎస్‌ను వెనక్కి నెట్టి మళ్లీ దేశంలోనే మార్కెట్ విలువ రీత్యా అతిపెద్ద సంస్థగా అవతరించింది. బాగా లాభపడిన ప్రధాన సంస్థలలో హీరో మోటోకార్ప్, హెచ్‌యూఎల్, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, విప్రో, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం ఉన్నాయి. నిఫ్టీ ప్యాక్‌లోని సంస్థలలో టెక్ మహీంద్రా అత్యధికంగా 3.93 లాభపడింది.