బిజినెస్

ఎఫ్‌డీలపై వడ్డీ పెంచిన ఎస్‌బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల)పై వడ్డీ రేటును 0.1 శాతం వరకు పెంచింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన ప్రకటన వెలువడనున్న తరుణంలో ఎస్‌బీఐ ఎంపిక చేసిన కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర బ్యాంకులు కూడా ఎస్‌బీఐ బాటలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పెరిగిన వడ్డీ రేట్లు జూలై 30వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాది నుంచి రెండేండ్లలోపు కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటు 6.40 శాతం ఉంటుంది. గతంలోని వడ్డీ రేటుతో పోలిస్తే ఇప్పుడు అయిదు బేసిస్ పాయింట్లు ఎక్కువ. దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పది బేసిస్ పాయింట్లు పెరిగింది. ఉదాహరణకు మూడేళ్ల నుంచి అయిదేళ్ల లోపు వరకు కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.80 శాతం ఉంటుంది. గతంలో ఇలాంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.70 శాతం ఉండింది.
అలాగే, అయిదు నుంచి పదేళ్ల లోపు కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.85 శాతం ఉంటుంది. గతంలో ఇలాంటి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతం ఉండింది. అయితే, ఎస్‌బీఐ ఏడాది లోపు కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది.