బిజినెస్

వేగం తగ్గిన తయారీ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగం కార్యకలాపాలు జూన్‌తో పోలిస్తే జాలై నెలలో కాస్త తగ్గాయి. అయితే, మాన్యుఫాక్చరింగ్ రంగం ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు, ఉద్యోగ కల్పన మాత్రం స్వల్పంగా పెరిగాయని ఒక నెలవారీ సర్వే వెల్లడించింది. నిక్కెయి ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్ నెలలో ఉన్న 53.1 నుంచి జూలై నెలలో 52.3కు తగ్గింది. అయితే మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ 50-పాయింట్ స్థాయికి పైన కొనసాగడం ఇది వరుసగా 12వ నెల. ఈ సూచీ 50కి పైన ఉంటే విస్తరిస్తున్నట్టు, కిందికి దిగజారితే మందగిస్తున్నట్టు అర్థం. 3మాన్యుఫాక్చరింగ్ రంగంలో జూలై నెలలో ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు, ఉద్యోగ కల్పన స్వల్పంగా పెరిగినప్పటికీ, ఇటీవల చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఈ రంగం విస్తరణలో వేగం కాస్త తగ్గింది2 అని ఐహెచ్‌ఎస్ మర్కిట్‌లో ఆర్థికవేత్త, నివేదిక రచయిత ఆష్నా డోదియా పేర్కొన్నారు.