బిజినెస్

జీడీపీ అంచనా వృద్ధి రేటు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 1: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంచనా వృద్ధి రేటును 7.4 శాతంగానే కొనసాగించింది. భారతదేశ ఎగుమతులపై ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు బాగా పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వస్తువులకు డిమాండ్ పరిస్థితులు ఉత్సాహకరంగా ఉన్నాయంటూ ఆర్‌బీఐ జీడీపీ అంచనా వృద్ధి రేటును యథాతథంగా కొనసాగించింది. 2018-19 ఆర్థిక సంవత్సర మూడో ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో ఆర్‌బీఐ.. దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు క్రియాశీలకంగా ఉన్నాయని వివిధ సూచీలు వెల్లడిస్తున్నాయని పేర్కొంది. ఇప్పటివరకు రుతు పవనాల పురోగమనం, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) బాగా పెరగడం వల్ల రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని మూడు రోజుల పాటు సాగిన ఎంపీసీ సమావేశం తరువాత బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. 3కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ప్రత్యేకించి ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆదాయాలు బాగా పెరగడం గ్రామీణ ప్రాంతాల్లో వస్తువులకు పెరిగిన డిమాండ్‌ను సూచిస్తున్నాయి2 అని ఆర్‌బీఐ తెలిపింది. ఇటీవలి కాలంలో ఫైనాన్సింగ్ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ పెట్టుబడుల కార్యకలాపాలు దృఢంగానే కొనసాగుతున్నాయని పేర్కొంది. మొత్తం పరిస్థితిని మదింపు వేసి, జూన్ నెల ప్రకటనలో అంచనా వేసిన 2018-19 సంవత్సర జీడీపీ వృద్ధి రేటును ఇప్పుడు యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ అంచనా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో జీడీపీ వృద్ధి రేటు 7.5-7.6 శాతం ఉంటుంది. రెండో అర్ధ భాగం అక్టోబర్-మార్చిలో 7.3-7.4 శాతం ఉంటుంది.