బిజినెస్

ఆరంభం అదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 6: దేశీయ మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయి. గత వారం రికార్డు స్థాయిలో పెరిగిన ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ లావాదేవీల జోరు ఈ వారం మొదటి రోజున కూడా కొనసాగింది. ఇప్పటికే సెనె్సక్స్ రికార్డు స్థాయికి చేరుకోగా, సోమవారం స్వల్పంగా పెరిగి, 37,805.25 పాయింట్లకు చేరుకుంది. ఇది సరికొత్త రికార్డుగా నమోదైంది. మొత్తం మీద సెనె్సక్స్, నిఫ్టీ స్వల్పంగా పెరగ్గా, బ్యాంకింగ్ రంగం లాభపడింది. ఎనర్జీ, టెలికాం రంగాల స్టాక్స్ కూడా లాభాలను సంతరించుకున్నాయి. ఇంట్రా డే రికార్డు స్థాయి ఈనెల ఒకటిన అత్యధికంగా 37,711.87 పాయింట్లు ఉండగా, తాజాగా, సోమవారం ఒకానొక దశలో 37,805.25 పాయింట్లకు చేరుకొని, కొత్త రికార్డుకు తెరతీసింది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్ షేర్లు ముందుకు దూసుకెళ్లాయి. మొత్తం మీద సెనె్సక్స్ 0.36 శాతం లేదా 135.73 పాయింట్లు పెరిగి, 37,691.89 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇప్పటి వరకూ ఇదే అత్యుత్తమ రికార్డు. నిఫ్టీ 26.30 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి, 11,387.10 పాయింట్లతో ముగియడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత శుక్రవారం 11,360.80 పాయింట్లతో నెలకొన్న అత్యధిక పాయింట్ల రికార్డు బద్దలైంది. కన్జూమర్ డ్యూరబుల్స్ లాభాలను సంపాదించగా, 50 మార్క్ షేర్ ఇండెక్స్ 11,400 పాయింట్ల మైలురాయిని తొలిసారి అధిగమించింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో 11,427.65 పాయింట్ల నమోదు కావడం విశేషం. పీఎస్‌యూ, మెటల్ పరిశ్రమలు కూడా ట్రేడింగ్‌లో లాభపడ్డాయి. మొత్తం మీద సోమవారం అసాధారణ స్థాయిలో లావాదేవీలు జరగకపోయినా, అప్పటికే సెనె్సక్స్, నిఫ్టీ జోరుమీద ఉండడంతో, స్వల్ప పెరుగుదల కూడా రికార్డులు సృష్టించగలిగింది.