బిజినెస్

15 శాతం వృద్ధి రేటే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటుకానున్న పరిశ్రమలకు సకల సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సుప్రసిద్ధ సంస్థ షియోమీ సౌజన్యంతో తిరుపతిలో మొబైల్ విడిభాగాల ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ హోలీటెక్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం సచివాలయంలోని ఒకటవ బ్లాక్‌లో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్, షియోమీ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఎంఒయు కుదిరింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటవుతున్న అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హోలీటెక్ తిరుపతిలో పరిశ్రమను స్థాపించడం శుభసూచకమన్నారు. త్వరలో పనులు ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో ఎకో సిస్టం రావటం ముఖ్యమన్నారు. అన్నిరకాల పరిశ్రమలకు తగిన సదుపాయాలు, సౌకర్యాల కల్పనలో ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తిరుపతికి చేరువలో కృష్ణపట్నంతో సహా రెండు ఓడరేవులు ఉన్నాయని ఐఐటీ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు కూడా జరుగుతోందని చెప్పారు. చెన్నై, నెల్లూరు, తిరుపతి పట్టణాలతో కూడిన త్రికోణ భూభాగం పారిశ్రామికవాడ అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీఐఐసీ పరిశ్రమలకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించటంలో సహకరిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని హోలీటెక్ ప్రతినిధులకు సూచించారు. పరిశ్రమల స్థాపన, వ్యాపార నిర్వహణకు ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందని వివరించారు. తిరుపతి నుంచి రోడ్లు, రైళ్లు, సముద్రయానం వంటి సకల సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యుత్, జలవనరులకు కొరత లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అనువైన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రెండేళ్ల నుంచి రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. భవిష్యత్‌లో ఈ స్థానాన్ని పదిలం చేసుకోగలమనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ గవర్నెన్స్ నిర్వహణలో కూడాప్రభుత్వానికి మంచి అనుభవం ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 7.8 శాతం అభివృద్ధి సాధిస్తుంటే రాష్ట్రంలో నికరంగా 10.5 శాతం వృద్ధిరేటు ఉందని దీన్ని 15 శాతం పెంచటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతపురంలో దక్షిణ కొరియా కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు గాను ఐద నెలల్లోనే నీటివనరుల కల్పనలో సఫలీకృతులయ్యామని వివరించారు. ఎలక్ట్రానిక్స్ కంపెనీ నెలకొల్పడంపై ఒప్పందంలో నిర్దేశించిన తేదీల మేరకు పనులు జరగాలని స్పష్టంచేశారు. చైనా కంటే భారత్‌లో పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏదైనా ప్రారంభించిన తరువాత రియల్‌టైంలో పూర్తి సేస్తున్నాం.. ఈ రోజు నుంచే కంపెనీ పనులు ప్రారంభిస్తే మేం అందుకు తగ్గట్టుగా సహకరిస్తామని వెల్లడించారు.
పరస్పర సహకారంతో విజయపథాన దూసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని ప్రకటించారు. చైనాలో శాచురేషన్ వచ్చింది.. భారత్‌లో ఇప్పుడు విస్తృత అవకాశాలు ఉన్నాయి.. చైనా కంటే మరింత సానుకూల పరిస్థితులు కల్పిస్తాం.. మేం ఆర్టీజీని నెలకల్పి మెరుగైన పాలనకు శ్రీకారం చుట్టాం.. చైనా కూడా భారత్‌లో జరిగే అభివృద్ధిపై దృష్టి సారించిందని ఉద్ఘాటించారు. నాలుగైదు నెలల్లోనే తమ ప్రభుత్వ పనితీరు తెలుస్తుందని నిర్దేశిత లక్ష్యాలకే ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెప్పారు. సమావేశంలో మంత్రి లోకేష్, హోలీటెక్ సీఈఒ ప్రేమ్‌చంద్, షియోమీ వైస్‌ప్రెసిడెంట్ మనోజైన్, సీఎం కార్యదర్శి రాజవౌళి, ఐటీ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..హోలీటెక్ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుంటున్న దృశ్యం