బిజినెస్

రూ. 6,416 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: గతంలో ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)లు దాఖలు చేయని 2.09 లక్షల మంది తొలిసారి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌లు దాఖలు చేయడంతో పాటు రూ. 6,416 కోట్లు ఆదాయపు పన్ను (ఐటీ) రూపంలో చెల్లించారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఒక ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
పెద్ద నోట్ల రద్దు తరువాత తమ బ్యాంకు ఖాతాల్లో రూ. పది లక్షలకు పైగా మొత్తాన్ని డిపాజిట్ చేసుకొని, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని 3.04 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసిందని మంత్రి చెప్పారు. ఫలితంగా ‘నాన్ ఫైలర్స్’ (ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని వారు)గా గుర్తించిన వారిలో 2.09 లక్షల మంది ‘సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్’గా రూ. 6,416 కోట్లు చెల్లించారు’ అని శుక్లా వివరించారు.
ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రచారం వల్ల గత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18 శాతం పెరిగి, రూ. 10.03 లక్షల కోట్లకు చేరుకున్నాయని మంత్రి వెల్లడించారు. అలాగే, పర్సనల్ అడ్వాన్స్ టాక్స్ 23.4 శాతం, పర్సనల్ అసెస్‌మెంట్ టాక్స్ 29.9 శాతం చొప్పున పెరిగాయని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత జరిగిన అవకతవకలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 కింద 37 కేసులు నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు.