బిజినెస్

తిరిగి సరికొత్త శిఖరాలకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 8: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ వంటి ఇంధన రంగ దిగ్గజ కంపెనీల షేర్లు బాగా రాణించడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. సెనె్సక్స్ బుధవారం 221 పాయింట్లు (0.6 శాతం) పుంజుకొని, 37,887 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి, తొలిసారి 11,400 మార్కుకు పైన 11,450 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లతో కూడిన సూచీ నిఫ్టీ బ్యాంక్ బుధవారం తొలిసారి కీలకమయిన 28వేల మార్కుకు పైన ముగిసింది. రానున్న కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారత్ మూలంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చేసిన వ్యాఖ్యలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి.
బుధవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలోని లాభపడిన సంస్థలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, భారతి ఇన్‌ఫ్రాటెల్ ఉన్నాయి. ఈ సంస్థల షేర్ల విలువ సుమారు రెండు నుంచి మూడు శాతం వరకు పెరిగింది. నిఫ్టీలోని సంస్థలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడింది.
బ్యాంక్ నిఫ్టీ 0.7 శాతం ఎగువన ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 28,128 మార్కును తాకింది. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్ల విలువ 1.6 శాతం నుంచి 1.9 శాతం వరకు పుంజుకుంది. బజాజ్ ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, మాక్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నేతృత్వంలో ఆర్థిక సేవల షేర్లు రాణించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. వీటి షేర్ల ధర ఒకటి నుంచి మూడు శాతం వరకు పెరిగింది.
అమెరికా మార్కెట్లు బలపడిన నేపథ్యంలో ఇతర ఆసియా మార్కెట్ల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లకు మద్దతు లభించింది. అయితే, ఫార్మా షేర్ల విలువ పడిపోవడం మార్కెట్ కీలక సూచీల మరింత పెరుగుదలను అడ్డుకుంది. జూన్ త్రైమాసికంలో లుపిన్ నికర లాభం 43 శాతం పడిపోవడం వల్ల ఆ కంపెనీ షేర్ల విలువ అయిదు శాతం తగ్గింది. అరబిందో ఫార్మా, దివిస్ ల్యాబ్స్, బయోకాన్ షేర్లు ఒకటి నుంచి మూడు శాతం వరకు దిగువన ముగియడం కూడా నిఫ్టీ ఫార్మా సూచీ 0.7 శాతం పడిపోవడానికి కారణమయింది.
రానున్న సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్ల లావాదేవీలలో కొంత వరకు ఊగిసలాట ధోరణి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠ స్థాయిల వద్దకు చేరినప్పటికీ, మార్కెట్ కొంత సంఘటితం అవుతుందనే అంశాన్ని తోసిపుచ్చలేం. రానున్న ఒకటి రెండు రోజుల్లో మరిన్ని కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నందున నిర్దిష్టమయిన స్టాక్ ఆధారిత ఊగిసలాట కొనసాగుతుంది’ అని రెలిగేర్ బ్రోకింగ్ అధ్యక్షుడు జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. అమెరికా స్టాక్ మార్కెట్‌లోని ఎస్‌అండ్‌పీ 500 రికార్డు గరిష్ఠ స్థాయికి సమీపంలోకి చేరింది.