బిజినెస్

మరింత ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇంకా రాణించాల్సి ఉందని, తన పనితీరును ఉత్తమ స్థాయికి పెంచుకోవలసి ఉందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అప్పుడు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎన్‌ఎస్‌ఈని ప్రారంభించారు. ఎన్‌ఎస్‌ఈ ప్రారంభమయి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఇక్కడ నిర్వహించిన రజతోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994లో తాను ఆర్థిక మంత్రిగా ఎన్‌ఎస్‌ఈని ప్రారంభించిన నాటి పరిస్థితుల గురించి వివరించారు. అవి దేశ భవిష్యత్తు కోసం బాగా ఆలోచిస్తున్న రోజులని, ఆర్థిక రంగంలో ఉన్న వారు సహా అనేక మందికి ఎన్నో సందేహాలు, సంశయాలు ఆ రోజుల్లో ఉండేవని మన్మోహన్ గుర్తు చేశారు. ‘ఆ సందేహాలు, సంశయాలు తప్పని నిరూపితమయింది. ఇది దేశానికి ఎంతో మంచిదయింది’ అని ఆయన పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌ను దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా అంతా భావిస్తుంటారు. 1991నాటి సంస్కరణలు, ఆ తరువాత చేపట్టిన సంస్కరణలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడానికి పునాదులు వేశాయని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు. ఎన్‌ఎస్‌ఈ గొప్ప జాతీయ ప్రాధాన్యత గల సంస్థ అని, దేశ క్యాపిటల్ మార్కెట్ల పరివర్తనలో, మార్కెట్ల పట్ల విశ్వాసాన్ని పాదుగొల్పటంలో ఇది ఎంతో కీలక పాత్ర నిర్వహించిందని ఆయన వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కీలకమయిన మార్కెట్ల అభివృద్ధికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడానికి ఎన్‌ఎస్‌ఈ తన బృహత్తరమయిన కృషిని మున్ముందు కూడా కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని మన్మోహన్ సింగ్ వ్యక్తం చేశారు.