బిజినెస్

ఐటీ ఎగవేతదారులను వదిలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఆదాయం పన్ను శాఖ గత ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 6.86 కోట్ల రిటర్న్స్‌లో 0.35 శాతం కేసులను మాత్రమే స్క్రూటినీకి చేపట్టినట్లు పేర్కొంది. ఆదాయం పన్ను చెల్లింపుదార్లంటే తమకు విశ్వాసం ఉందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. పన్ను ఎగవేతదారులను వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు. గురువారం ఇక్కడ అసోచామ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 0.35 శాతంలో 0.15 శాతం మేర లిమిటెడ్ స్క్రూటినీ, 0.20 శాతం పూర్తి స్క్రూటినీ చేశామని చెప్పారు. పెద్ద స్థాయిలో పన్ను ఎగవేతకు పాల్పడిన కేసుల్లో మాత్రమే స్క్రూటీని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానిత పన్ను ఎగవేతదారులు అనేక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆదాయం పన్ను శాఖ అధికారులు గత ఏడాది 4700 కేసులను ప్రాసిక్యూషన్ నిమిత్తం దాఖలు చేశారన్నారు. పన్ను ఎగవేతదారుల పద్ధతులను ఆధునిక సాంకేతిక సమాచారం ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. పన్నుల చెల్లింపు విధానం, రిటర్న్స్‌ను సరళీకృతం చేస్తామన్నారు. చట్టాలకు అనుగుణంగా నడుచుకునే విధానం మంచిదన్నారు. గత ఏడాది రూ.10.03 లక్షలకోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే పన్ను ఆదాయం 18 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు.