బిజినెస్

వచ్చే నెలలో పెరగనున్న హోండా కార్ల ధరలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ఏప్రిల్ నుంచి వాహనాల ధరలను పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం మధ్య పెరిగిన ఉత్పాదక వ్యయంతో వివిధ మోడళ్ల ధరలను గరిష్ఠంగా 6,000 రూపాయల వరకు పెంచాలని యోచిస్తోంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే వివిధ రకాల కార్లపై 79,000 రూపాయల వరకు హోండా ధరలను పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను గత నెల 29న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ దీనికి కారణం.