బిజినెస్

ముంచిన మొండి బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను మొండి బకాయిలు తీవ్ర స్థాయిలో దెబ్బతీశాయి. ఎస్‌బీఐ శుక్రవారం ప్రకటించిన ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలలో భారీగా రూ. 4,876 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ఎస్‌బీఐ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 2,006 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. బ్యాంకు ఈ మేరకు నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించిన పత్రాలలో ఈ విషయం పేర్కొంది. మొండి బకాయిల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో బ్యాంకు ఆదాయం మాత్రం పెరిగింది. 2017-18 తొలి త్రైమాసికంలో రూ. 62,911.08 కోట్ల ఆదాయం పొందిన ఎస్‌బీఐ, 2018-19 తొలి త్రైమాసికంలో దాన్ని రూ. 65,492.67 కోట్లకు పెంచుకుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి బ్యాంకు మొత్తం అడ్వాన్స్‌లలో నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 10.69 శాతానికి పెరిగాయి. గత సంవత్సరం జూన్ నాటికి బ్యాంక్ మొత్తం అడ్వాన్స్‌లలో నిరర్ధక ఆస్తులు 9.97 శాతం ఉన్నాయి. అయితే, నికర నిరర్ధక ఆస్తులు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 5.97 శాతం ఉన్న నికర నిరర్ధక ఆస్తులు 5.29 శాతానికి తగ్గాయి.
అయిదు శాతం తగ్గిన షేర్ల విలువ
జూన్ త్రైమాసికంలో భారీగా నష్టాలు రావడం వల్ల స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ఎస్‌బీఐ షేర్ల విలువ దాదాపు అయిదు శాతం పడిపోయింది. దీంతో బ్యాంకు మార్కెట్ విలువ (ఎంక్యాప్) రూ. 10,708.93 కోట్లు తగ్గింది. బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్ విలువ 3.79 శాతం పడిపోయి, రూ. 304.45 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈలో 4.85 శాతం పడిపోయి, రూ. 301.10 వద్ద స్థిరపడింది. ఫలితంగా ఎస్‌బీఐ మార్కెట్ విలువ శుక్రవారం రూ. 10,708.93 కోట్లు పడిపోయి, రూ. 2,71,709.07 కోట్లకు చేరింది.