బిజినెస్

దెబ్బ తీసిన లాభాల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల నుంచి శుక్రవారం పడిపోయాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉండటం వల్ల మార్కెట్ కీలక సూచీలు దిగజారాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 155 పాయింట్లు పడిపోయి కీలకమయిన 38వేల పాయింట్ల స్థాయికన్నా దిగువన ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ అయిదు రోజుల పరుగుకు తెరపడింది. శుక్రవారం 41 పాయింట్లు పడిపోయిన ఈ సూచీ 11,430 పాయింట్ల వద్ద స్థిరపడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ వంటి ఫైనాన్సియల్ సంస్థల షేర్ల విలువ పడిపోవడం వల్ల మార్కెట్ కీలక సూచీలు దిగజారాయి. చైనాలోని సంస్థలకు అక్కడి ప్రభుత్వ మద్దతు బాగా ఉందనే సంకేతాలు వెలువడినప్పటికీ, ప్రపంచ వాణిజ్య వివాదాల ఉద్రిక్తతలు పెరుగుతాయనే భయాందోళనలతో ఇతర ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా శుక్రవారం బలహీనపడ్డాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థలలో ఎస్‌బీఐ అత్యధికంగా 3.79 శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ జూన్ త్రైమాసికంలో భారీగా రూ. 4,876 కోట్ల నికర నష్టాన్ని చవిచూడటంతో దాని షేర్ల విలువ పడిపోయింది. శుక్రవారం ఉదయం కొంచెం ఎగువన 38,050.07 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ కొద్ది సేపటికే 38వేల మార్కుకన్నా దిగువకు దిగజారింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 37,815.75 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 155.14 పాయింట్ల (0.41 శాతం) దిగువన ముగిసింది. ఈ సూచీ గురువారం 137 పాయింట్లు పుంజుకొని లైఫ్ టైమ్ హై 38,024.37 పాయింట్ల వద్ద ముగిసిన విషయం విదితమే. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 41.20 పాయింట్లు (0.36 శాతం) పడిపోయి 11,429.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ గురువారం లైఫ్ టైమ్ హై 11,470.70 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం పరంగా చూస్తే ఈ రెండు కీలక సూచీలు వరుసగా మూడో వారం పుంజుకున్నాయి. సెనె్సక్స్ ఈ వారంలో 313.07 పాయింట్లు (0.83 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 68.70 పాయింట్లు (1.01 శాతం) పెరిగింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) గురువారం నికరంగా రూ. 85.39 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 370.68 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని నష్టపోయిన సంస్థలలో లార్సన్ అండ్ టర్బో, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, వేదాంత, సన్ ఫార్మా, ఎస్‌బీఐఎన్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.67 శాతం నుంచి 3.79 శాతం వరకు పడిపోయింది. సెనె్సక్స్ దిగజారడానికి ఎస్‌బీఐ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధానంగా కారణమయ్యాయి. నిఫ్టీ ప్యాక్‌లోని సంస్థలలో సన్ ఫార్మా, గెయిల్, టాటా మోటార్స్, వేదాంత, ఎస్‌బీఐఎన్ ప్రధానంగా నష్టపోయాయి. వీటి షేర్ల విలువ 2.97 శాతం నుంచి 4.63 శాతం వరకు పడిపోయింది. ఐరోపా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణి ప్రభావం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.