బిజినెస్

మరోసారి సంప్రదింపులు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ-కామర్స్ విధాన ముసాయిదాపై సంబంధిత వ్యక్తులు, సంస్థలతో మరోసారి సంప్రదింపులు జరపాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం అధికారులను ఆదేశించారు. ఈ-కామర్స్ విధాన ముసాయిదాలోని కొన్ని ప్రతిపాదనలపై సంబంధిత వర్గాల నుంచి ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తమయిన నేపథ్యంలో మంత్రి మరోసారి చర్చలు జరపాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో వెల్లడించింది. ఈ-కామర్స్ విధాన ముసాయిదాలోని కొన్ని ప్రతిపాదనలపై మంత్రిత్వ శాఖకు ఆందోళనలు, అభ్యంతరాలు వచ్చాయని, అందువల్ల వాటిని పరిష్కరించడానికి మరోసారి సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపాలని మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించారని ట్విట్టర్ పోస్ట్ వివరించింది. ఈ-కామర్స్ విధాన ముసాయిదాను తిరిగి రూపొందించిన తరువాత మంత్రి వ్యక్తిగతంగా దాన్ని సమీక్షిస్తారు. ‘వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ రంగం వృద్ధి కోసం తొలుత రూపొందించిన విధాన ముసాయిదాలో అనేక ప్రతిపాదనలు చేశారు. ఆన్‌లైన్ రిటెయిల్ సంస్థలు భద్రత, గోప్యతకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి భారత్‌లో యూజర్ డాటాను భద్రపరచాలని తొలుత రూపొందించిన విధాన ముసాయిదా సూచించింది. ఆన్‌లైన్ రిటెయిలర్‌కు చెందిన ఏదయినా గ్రూప్ కంపెనీని ఉత్పత్తుల విక్రయ ధరను, సేవలను ప్రభావితం చేసేందుకు అనుమతించకూడదని నిర్దేశించింది. అంటే ఈ-టెయిలర్లు భారీ డిస్కౌంట్లు ఇవ్వకుండా ఇది నిరోధిస్తుంది.