బిజినెస్

ఆరు టెలికామ్ ఆపరేటర్లకు త్వరలో డిమాండ్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: యుపిఎ ప్రభుత్వ హయాంలో రూ.46 వేల కోట్ల మేరకు ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించిన ఆరు టెలికామ్ ఆపరేటర్లకు టెలికామ్ విభాగం (డాట్) త్వరలో రూ.12,500 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేయనుంది. ఆర్‌కామ్, టాటా టెలీ, వోడాఫోన్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, ఐడియా సెల్యులార్ సంస్థలకు త్వరలో డాట్ ఈ నోటీసు జారీ చేసేందుకు సిద్ధమవుతోందని టెలికామ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2006-2010 మధ్య కాలంలో ఆరు టెలికామ్ సంస్థలు తమ ఎజిఆర్‌ను (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాన్ని) 46,045.75 కోట్ల రూపాయలు తక్కువగా చేసి చూపాయని, దీనివలన ప్రభుత్వానికి 12,488.93 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని మార్చి నెలలో పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. ఈ నివేదికకు సంబంధించిన పత్రాలు గత నెల డాట్‌కు అందడంతో ఆ టెలికామ్ ఆపరేటర్ల నుంచి సదరు ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు డాట్ డిమాండ్ నోటీసును రూపొందిస్తోందని, ఈ ఆదాయాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆ అధికారి స్పష్టం చేశారు.