బిజినెస్

ఐబీసీ.. ఓ చర్నకోలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దివాలా ప్రక్రియ స్మృతి (ఐబీసీ) వల్ల రుణాల వసూళ్ల వేగం పెరిగిందని, దీని వల్ల బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపడిందని ఫీక్కీ అనే వాణిజ్య సంస్ధ పేర్కొంది. ఈ స్మృతి అమలులోకి వచ్చిన తర్వాత బకాయిపడిన పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రమోటర్లు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారని ఫిక్కీ పేర్కొంది. ఈకోడ్‌ను పటిష్టం చేయాలని, కోర్టుల సాధికారత పెంచాలని బ్యాంకులు సూచించినట్లు ఫిక్కీ సర్వేలోవెల్లడైంది. మారటోరియం కాలాన్ని 270రోజుల కంటే మించి పెంచరాదని సర్వేలో పాల్గొన్న 22 బ్యాంకుల అధికారులు తెలిపారు. ఐబీసీ అమలులోకివచ్చిన తర్వాత రుణాలవసూళ్లపై బ్యాంకులు దృష్టిసారించారు. బ్యాంకులు రుణాల మంజూరులో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, జీడీపీ తగ్గుదల, ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల వల్ల ప్రతికూలఫలితాలు వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఫార్ములాను బ్యాంకులు స్వాగతిస్తున్నాయి. దీని వల్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందని బ్యాంకర్లు పేర్కొన్నారు. డిపాజిటర్లకు కూడా మంచి జరుగుతుంది. అక్రమ లావాదేవీలు, సైబర్ సెక్యూరిటీ వల్ల ముప్పుతలెత్తకుండా ప్రణాళిక అవసరమని బ్యాంకర్లు పేర్కొన్నారు.