బిజినెస్

రూ.8,500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ముడి చమురు ధరల్లో తగ్గుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నిలకడగా ఉండటం, జూన్ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటం వల్ల భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ మదుపరులు ఉత్సాహం చూపుతున్నారు. గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో ఫారిన్ ఇనె్వస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో రూ. 8,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జూలై నెలలో భారత క్యాపిటల్ (ఈక్విటి, డెబిట్) మార్కెట్లలో నికరంగా రూ. 2,300 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), ఆగస్టు నెలలో ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలోనే రూ. 8,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకు ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో విదేశీ మదుపరులు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 61,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. తాజా డిపాజిటరి డాటా ప్రకారం, ఎఫ్‌పీఐలు ఆగస్టు ఒకటి నుంచి పదో తేదీ మధ్య నికరంగా రూ. 2,373 కోట్ల నిధులను భారత ఈక్విటి మార్కెట్లలో, రూ. 6,208 కోట్ల నిధులను డెబిట్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారు. అంటే మొత్తం రూ. 8,581 కోట్లు (1.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులుగా పెట్టారు.