బిజినెస్

దేశంలో సమృద్ధిగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఈక్రమంలో మరో ఐదు నుంచి ఆరు శాతం నిల్వలు తగ్గినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ (డీబీఎస్) నివేదిక పేర్కొంది.
ఈ యేడాది ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లలో భాగంగా రూపాయి విలువ అధిక శాతం పతనం నెలకొంది. ఈ నేపధ్యంలో విదేశీ మారకద్రవ్య నిల్వల్లోనూ తరుగుదలకు దారితీసే అవకావం ఉందని, రిజర్వు బ్యాంకు ఈ వ్యవహారంలో కలుగజేసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే వివిధ విభాగాల్లో భారత దేశపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు సంతృప్తికరంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక భరోసా ఇచ్చింది. ఈ యేడాది ఏప్రిల్ నుంచి రూపాయి విలువ పతనం అవుతున్న క్రమంలో విదేశీ నిల్వలు ఏప్రిల్‌లో 426 మిలియన్ అమెరికన్ డాలర్లు, ఆగస్టు తొలినాళ్లలో మరో 403 మిలియన్ అమెరికన్ డాలర్లు వంతున గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్‌కు ఇరుగు పొరుగు దేశాలతో పోల్చుకుంటే భారతదేశపురూపాయి అధిక శాతం విలువ కోల్పోయి ఈ యేడాది 69.62 రూపాయలకు చేరింది. ఇది రూపాయి చరిత్రలో అత్యధిక కుంగుబాటు కావడం గమనార్హం. దేశ తలసరి ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే రానున్న కొనేళ్లపాటు భారత విదేశీ మారకద్రవ్యం నిల్వలు ఇతర దేశాలకన్నా తక్కువగా స్థాయిలో ఉండే అవకాశం ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.