బిజినెస్

డబ్బే..డబ్బు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర తీసుకుంటున్న చర్యలు, ఆర్‌బీఐ తీర్మానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఇటీవల బ్యాంక్‌లకు చేరుతున్న డబ్బు స్పష్టం చేస్తున్నది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, రెపో రేట్‌ను ఇటీవలే ఆర్‌బీఐ పెంచిన విషయం తెలిసిందే. దీనికితోడు కేంద్రం దివాలా చట్టాన్ని చురుగ్గా అమలు చేస్తున్నది. దీనితో మొండి బకాయులు క్రమంగా తిరిగి రావడం మొదలైంది. ఈ చర్యల వల్ల బ్యాంక్‌ల్లోకి మళ్లీ డబ్బు చేరుతున్నది. నిరర్ధక ఆస్తులు పెరడంతో సమస్యల్లో కూరుకుపోతున్న బ్యాంక్‌లకు జవసత్వాలను అందించేందుకు అటు కేంద్రం, ఇటు ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటున్నది. దివాలా చట్టం (ఐబీసీ)ని అమలు చేయడంతో, నిన్నమొన్నటి వరకూ బకాయిలు చెల్లించడానికి ఇష్టపడని చాలా కంపెనీలు, సంస్థలు ఇప్పుడు ఎంతో కొంత మొత్తాలను చెల్లిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే 36,551 కోట్ల రూపాయల మేరకు మొండి బాకీలు వసూలు కావడం విశేషం. మొత్తం మీద డిపాజిట్ల మీద వడ్డీ రేటు పెరగడం, దివాలా చట్టంతో వెసులుబాటు కల్పించడం వంటి చర్యలతో బ్యాంక్‌ల్లో మళ్లీ డబ్బు చేరుతున్నది. నిన్నమొన్నటి వరకూ వివిధ ఆంక్షల నేపథ్యంలో నగదుగానే సొమ్మును దాచుకోవడానికి ఇష్టపడే వారంతా ఇప్పుడు మళ్లీ బ్యాంక్‌లకు క్యూకడుతున్నారు. ఇది శుభపరిణామమని విశే్లషకులు అంటున్నారు.