బిజినెస్

7.5 శాతానికి మించనున్న వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తిరిగి కోలుకునే దశలోకి అడుగు పెట్టిందా? దీనికి అవుననే అంటున్నారు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మానీ. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తిరిగి కోలుకునే దశలోకి అడుగిడినట్టు కనపడుతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఆయన ఆదివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమెరికా-చైనా మధ్య దిగుమతి సుంకాల యుద్ధం వల్ల అమెరికాకు భారత్ ఎగుమతులు పెరిగే అవకాశం కలిగిందని ఆయన అన్నారు. ‘గత ఏడేళ్లుగా అనేక హెచ్చుతగ్గులకు గురవుతూ వస్తున్న ఆర్థిక వ్యవస్థ వృద్ధి తిరిగి కోలుకునే దశలోకి అడుగు పెట్టినట్టు కనిపిస్తోంది. దేశీయంగా పెట్టుబడులు, ఆర్థిక దూరదృష్టిని పణంగా పెట్టి రాజకీయ లక్ష్యాల కోసం ప్రభుత్వం చేసే వినియోగం స్థూలార్థిక పరిస్థితులు నిలదొక్కుకోవడానికి ప్రధానమయిన రిస్క్‌గా ఉంది. ఈ ప్రతికూల ప్రభావానికి లోనుకాకుండా ఉంటే, దేశం ఈ ఆర్థిక సంవత్సరంలో దృఢంగా 7.5 శాతానికి మించి ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును నమోదు చేస్తుంది’ అని విర్మానీ పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా నెలకొన్న ఆందోళనల వల్లనే ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. అమెరికా- చైనా దిగుమతి సుంకాల యుద్ధంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్ప కాలం పాటు ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.