బిజినెస్

మిగులు విద్యుత్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వినియోగం అత్యధికంగా ఉండే ఏప్రిల్ నుంచి జూలై మాసం వరకూ విద్యుత్ లోటు కొనసాగుతున్నదని, ఫలితంగా మిగులు విద్యుత్ అనేదే లేదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) స్పష్టం చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో విద్యుత్ లోటు 0.9 శాతంకాగా, మొత్తం మీద 0.6 శాతంగా ఉందని ఒక నివేదికలో స్పష్టం చేసంది. కీలక సమయాల్లో 172.38 గిగావాట్స్ డిమాండ్ ఉండగా, 170.76 గిగావాట్స్‌ను సరఫరా జరిగిందని తెలిపింది. ఫలితంగా, అత్యంత కీలక సమయాల్లో విద్యుత్ లోటు 0.7 శాతంగా నమోదైందని పేర్కొంది. ఏప్రిల్ నుంచి జూలై వరకూ నాలుగు నెలల కాలానికి 436.14 బిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరంకాగా, 433.48 బిలియన్ యూనిట్ల సరఫరా అయిందని సీఈఏ తెలిపింది. కీలక సమయాల్లో 4.6 శాతం, మొత్తం మీద 2.5 శాతం విద్యుత్‌లోటు కనిపిస్తున్నదని వివరించింది. డిమాండ్ ఎక్కువగా లేని సమయాల్లో కొంత మిగులు విద్యుత్ ఉంటుందని, కానీ, వేసవి కాలంలో డిమాండ్ ఎక్కువ ఉండడంతో, మిగులు లేకపోగా లోటు నమోదవుతున్నదని తెలిపింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంతృప్తికరంగానే ఉందని, అయితే, మరికొంత పెరుగుదల అవసరమని తెలిపింది.