బిజినెస్

ఒక్కరోజే రూ.800 పెరిగిన వెండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో శనివారం ఒక్కరోజే వెండి ధర కిలోకు 800 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో వెండి కిలో ధర రూ. 46,300కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులనుంచి డిమాండ్ బాగా ఉండడం వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం. భవిష్యత్తులో వెండి ధరలు ఇంకా పెరుగుతాయన్న అంచనాల కారణంగా దీనిపై మరింతగా పెట్టుబడులు పెట్టడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చింది. మరో వైపు వరసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. శనివారం పది గ్రాములపై రూ. 150 కోల్పోయి రూ.30,700కు చేరుకుంది. గత మూడు రోజుల్లో బంగారం ధర పది గ్రాములపై రూ. 350 రూపాయలు తగ్గింది.