బిజినెస్

సరైన సమయమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 15: డాలర్‌తో రూపాయి మారకం విలువ తన సహజ విలువ అయిన సుమారు 72కు సమీపంలోకి చేరిందని, అయితే దీని విలువ మరింత పతనం కాకుండా నిలువరించేందుకు విధాన నిర్ణయం తీసుకోవలసిన అవసరం వచ్చిందని యెస్ బ్యాంక్ పేర్కొం ది. ‘సెంటిమెంట్‌కు ఊతమివ్వడానికి, రూపాయి పతనాన్ని నిలువరించడానికి విధాన నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరయిన సమయం. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ దాని సహజ విలువకు సమీపంలో కొనసాగుతోంది’ అని యెస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్, ప్రధాన ఆర్థికవేత్త శుభదరావు అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన మర్చెంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇండియా ఎకనమిక్ ఫోరం 2018లో ఆమె మాట్లాడుతూ తమ బ్యాంకు దృక్పథం ప్రకారం, 2011-12 ఆర్థిక సంవత్సరం ఆధారంగా డాలర్‌తో రూపాయి మారకం సహజ విలువ సుమారు 72 అని తెలిపారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ఇంకా పతనం కాకపోవచ్చని, అయితే సెంటిమెంట్స్, ప్రపంచ భౌగోళిక ఆర్థిక కారణాల వల్ల ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని ఆమె అన్నారు.