బిజినెస్

సెనె్సక్స్ 500 పాయింట్లు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 17: ఇటీవల కాలంలో బుల్న్ జోరందుకోవడంతో లాభాల బాటలో దూసుకెళ్లిన సెనె్సక్స్ ఈవారం మొదటి రోజు నీరసించింది. ఐదు వందలకుపైగా పాయింట్లు పతనమైంది. రూపాయి మారకపు విలువ పడిపోవడం, చైనా-అమెరికా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొనడం సెనె్సక్స్ పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. రూపాయి మారకపు విలువను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని కార్పొరేట్ రంగం వెదవి విరవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. రూపాయి పతనాన్ని అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదన్నది వాస్తవం. దేశీయ మదుపరులపై ఈ అంశం ప్రభావాన్ని చూపింది. మరోవైపు, చైనా నుంచి తమ దేశంలోని దిగుమతయ్యే వివిధ వస్తువులపై సుంకాన్నిమరింత పెంచాలని అమెరికా ఆలోచిస్తున్నదన్న వార్తలు మార్కెట్‌ను కుదిపేశాయి. రూపాయి పతనానికి చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం కూడా తోడైతే, రాబోయే కాలంలో షేర్ మార్కెట్ మరింత పడిపోతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా, అమ్మకాలు ఒక్కసారిగా పెరగడం సెనె్సక్స్‌ను దెబ్బతీసింది. రెండు సెషన్లలో పరిస్థితి కొద్దిపాటి ఆశాజనకంగా కనిపించినప్పటికీ, 505.13 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ 37,585.51 పాయింట్ల వద్ద ముగిసింది. పవర్ గ్రిడ్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్ తదితర కంపెనీలు లాభపడగా, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
కాగా, సెనె్సక్స్‌ను శాసించిన అంశాలే జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ నిఫ్టీపైనా ప్రభావం చూపాయి. సోమవారం లావాదేవీల్లో నిఫ్టీ 137.45 పాయింట్లు తగ్గింది. ఆటుపోట్ల మధ్య సాగిన నిఫ్టీ 11,377.75 పాయింట్ల వద్ద ముగిసింది. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, టెక్ మహీంద్ర, ఇండియన్ ఆయిల్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు లాభపడితే, బజాజ్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాటెల్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయిన కంపెనీల్లో ఉన్నాయి.