బిజినెస్

మైక్రాన్ పెట్టుబడి రూ.300 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సింగపూర్, తైవాన్, చైనా, మలేషియా, జపాన్ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ సెమీ కండక్టర్ టెక్నాలజీ సంస్థ మైక్రాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఇండియాలో కార్యకలాపాలను నిర్వహించబోతున్నట్టు మైక్రాన్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ప్రతినిధులు సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మైక్రాన్ సంస్థ తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు దేశంలో తెలంగాణను ఎంచుకోవడం పట్ల ధన్యవాదం తెలిపారు. హైదరాబాద్‌లో ఈ సంస్థ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టబోతుందని మంత్రి తెలిపారు. దీని వల్ల 1000 మంది ఇంజనీరింగ్, ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్ తెలిపారు. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ మాదాపూర్‌లో లక్షా ఎనబైవేల చదరపు అడుగుల విస్థీర్ణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మైక్రాన్ కంపెనీ ప్రతినిధులు చెప్పారని తెలిపారు. మైక్రాన్‌కు అవసరమైన సిబ్బంది ఎంపిక, శిక్షణకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డవలప్‌మెంట్ అండ్ నాలెడ్జ్-టాస్క్‌తో కలిసి పని చేస్తుందన్నారు. మైక్రాన్ సంస్థ హైదరాబాద్‌కు తరలిరానుండటంతో ఈ రంగంలోని మిగతా ప్రముఖ కంపెనీలు కూడా వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.

చిత్రం.. పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన మైక్రాన్ సంస్థ ప్రతినిధులు