బిజినెస్

ఆర్థిక వృద్ధికి వ్యూహం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, సెప్టెంబర్ 20: వ్యయంలో సమతుల్యతను సాధించడానికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవడానికి అవసరమయిన వ్యూహాన్ని రూపొందించేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య ఒక సంయుక్త సమావేశం జరగాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) పిలుపునిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునే పథంలోకి ప్రవేశించగా, భారత కరెన్సీ రూపాయి బలహీనపడుతోందని, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరుగుతున్నాయని, ముడి చమురు ధరలూ పెరుగుతున్నాయని, ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథానికి పెను సవాళ్లు విసురుతున్నాయని ఫిక్కీ అధ్యక్షుడు రాశేష్ షా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున వచ్చే సంవత్సరం ఎంతో ముఖ్యమయింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమయిన వ్యూహాన్ని రూపొందించేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య ఒక సంయుక్త సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది’ అని షా అన్నారు. వడోదర కేంద్రంగా పనిచేస్తున్న ‘ద ఫెడరేషన్ ఆఫ్ గుజరాత్ ఇండస్ట్రీస్ (గతంలో దీని పేరు ఫెడరేషన్ ఆఫ్ గుజరాత్ మిల్స్ అండ్ ఇండస్ట్రీస్) శత వార్షికోత్సవంలో పాల్గొనేందుకు షా ఇక్కడికి వచ్చారు. పెరుగుతున్న ముడి చమురు ధరలతో పాటు రూపాయి బలహీనత, ద్రవ్యోల్బణ పర్యవసాన ప్రభావం భారత స్థూలార్థిక వ్యవస్థకు సమీప భవిష్యత్తులో పెను సవాళ్లుగా పరిణమించాయని షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.