బిజినెస్

పుంజుకున్న రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 21: రూపాయి వరుసగా రెండో రోజు శుక్రవారం బలపడింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం 17 పైసలు పెరిగి, 72.20 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్రమయిన ఊగిసలాటకు గురయినప్పటికీ, అమెరికన్ కరెన్సీ అయిన డాలర్ అమ్మకాలు తగినంత స్థాయిలో ఉండటం వల్ల రూపాయి విలువ పుంజుకుంది. శుక్రవారం ఉదయం లావాదేవీలలో బలంగా పుంజుకున్న రూపాయి విలువ ఇంట్రా-డేలో డాలర్‌తో మారకంలో గరిష్ఠ స్థాయి 71.70 వద్దకు చేరింది. అయితే ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రా-డేలో కనిష్ట స్థాయి 72.48ని తాకింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదాలు తీవ్రమయినప్పటికీ, వాటి ప్రభావం ఫోరెక్స్ మార్కెట్‌పై పడలేదు. అమెరికా తాజాగా విధించిన దిగుమతి సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగనున్న తరుణంలో ఫోరెక్స్ మార్కెట్‌లో ఇనె్వస్టర్లు వేచిచూసే ధోరణిని అనుసరించారు. వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడం వల్ల కొన్ని విదేశీ కరెన్సీలతో మారకంలో అమెరికన్ డాలర్ విలువ పడిపోవడం కూడా భారత కరెన్సీ రూపాయి పుంజుకోవడానికి దోహదపడింది. ఈ వారం తొలి రోజుల్లో జీవనకాల కనిష్ట స్థాయికి విలువ కోల్పోయిన రూపాయి గత రెండు సెషన్లలో కలిసి 78 పైసలు కోలుకుంది. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల దేశ వాణిజ్య లోటు, కరెంటు ఖాతా లోటు (సీఏడీ) ఎక్కువయిన కారణంగా రూపాయి మారకం విలువ ఇటీవలి కాలంలో భారీగా పడిపోయింది.