బిజినెస్

టిసిఎస్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 14: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 10 శాతం పెరిగింది. 6,317 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 5,747 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు గురువారం ఇక్కడ టిసిఎస్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఐరోపా, ఉత్తర అమెరికా మార్కెట్లలోని మల్టీ బిలియన్ డాలర్ల డీల్స్ అందించిన ఉత్సాహమిది అని ఆయన అభివర్ణించారు. ఆదాయం విషయానికొస్తే 14.2 శాతం వృద్ధితో ఈసారి 29,305 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 25,668 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే ఈ ఏడాది జనవరి-మార్చితో పోల్చితే ఇప్పుడు సంస్థ లాభం పడిపోగా, ఆదాయం మాత్రం 3 శాతం పెరిగింది. ఇదిలావుంటే ఒక్కో షేర్‌కు 6.5 రూపాయల చొప్పున డివిడెండ్‌ను టిసిఎస్ ఈ సందర్భంగా ప్రకటించింది.

చిత్రం.. ముంబయిలో గురువారం త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న టిసిఎస్ సిఇఒ చంద్రశేఖరన్