బిజినెస్

‘స్టెర్‌లైట్’ తెరిచే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 22: తమిళనాడులోని ట్యుటికొరిన్‌లో స్టెర్‌లైట్ ప్లాంట్‌ను మళ్లీ తెరిచే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వేదాంత లిమిటెడ్ యూనిట్ ఆధ్వర్యంలోని ప్లాంట్‌ను మూసేయాలన్నది విధాన నిర్ణయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. కాగా మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి తరుణ్ అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఇటీవల స్టెర్‌లైట్ ప్లాంట్‌ను సందర్శించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఈ కమిటీని ఏర్పాటు చేసింది.‘ఒకసారి ప్లాంట్‌ను మూసేయాలని నిర్ణయం తీసుకున్నాకు వెనక్కు తీసుకోం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్‌ను పునఃరుద్ధరించబోం’అని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డీ జయకుమార్ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంపై పునరాలోచన ఏమిటీ?అని ఆయన ప్రశ్నించారు. వేదాంత కంపెనీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని ఆయన తెలిపారు. స్టెర్‌లైట్‌పై ఎలాంటి కమిటీ అవసరం లేదని రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టును కోరినట్టు జయకుమార్ తెలిపారు.‘స్థానిక ప్రజలు ప్లాంట్ వద్దని ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రజాభిప్రాయం మేరకే కంపెనీకి సీల్ వేయాలన్న నిర్ణయం తీసుకుంది’అని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి మూసేసిన కంపెనీని మళ్లీ తెరవడం అన్న ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. స్టెర్‌లైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ప్లాంట్‌ను మూసేయాలని 99 రోజులు పాటు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. వందో రోజు అంటే మే 22న ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పుల్లో 13మంది నిరసనకారులు మృతిచెందారు.