బిజినెస్

రెపో రేటు పావు శాతం తగ్గొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 14: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వచ్చే నెల జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. ఆగస్టు 9న ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను మూడో ద్వైమాసిక ద్రవ్యసమీక్షను ఆర్‌బిఐ చేపడుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా గురువారం అభిప్రాయపడింది. గత నెల జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పెరిగిన నేపథ్యంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఆర్‌బిఐ కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చని ఓ ప్రకటనలో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఈసారి దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వ్యవసాయ ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని ఇది కూడా వడ్డీరేట్లను తగ్గించడానికి ఆర్‌బిఐకి ఉన్న అవకాశాలను పెంచుతుందని చెప్పింది.