బిజినెస్

దేశీయ వ్యాపారం కుదుటపడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో కుంటుపడిన తన దేశీయ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరంలో కుదుటపడుతుందని ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్స్ ఆశిస్తోంది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యాపారం జీఎస్‌టీ అమలు తరువాత 2017-18 ఆర్థిక సంవత్సరంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే ఈ 2018-19 ఆర్థిక సంవత్సరంలో సన్ ఫార్మాస్యూటికల్స్ దేశీయ వ్యాపారం స్థిరత్వాన్ని సాధించి, సముచిత రీతిలో వృద్ధి పొందుతుందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) దిలీప్ శాంఘ్వి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఔషధాల ధరలను తగ్గించడం, విధానాలలో మార్పులు చేయడం వంటివి సన్ ఫార్మా వ్యాపారానికి గణనీయమయిన రిస్క్‌లుగా ఉన్నాయని 2017-18 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూపొందించిన వార్షిక నివేదికలో వాటాదారులకు పంపించిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. ‘జీఎస్‌టీ అమలు కారణంగా 2017-18లో ఇబ్బందులను ఎదుర్కొన్న కంపెనీ దేశీయ వ్యాపారం 2018-19లో సాధారణ స్థితికి చేరుకుంటుందని మేము అంచనా వేస్తున్నాం. జనాభా సంబంధ అంశాలు సానుకూలంగా ఉండటం వల్ల భారత్‌లో వ్యాపార పరిమాణం హేతుబద్ధ స్థాయిలో పుంజుకుంటుంది’ అని దిలీప్ శాంఘ్వి పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఔషధాల ధరల తగ్గింపును తప్పనిసరి చేయడం, విధానాలలో మార్పులు చేయడం వంటి అంశాలు కంపెనీ వ్యాపారానికి ఇప్పటికీ ప్రతికూల అంశాలుగానే ఉన్నాయని ఆయన వివరించారు. సన్ ఫార్మా 2017-18లో భారత్‌లో రూ. 8,029 కోట్ల వ్యాపారం చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యాపారంతో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి సాధించింది. ఇదిలా ఉండగా, అమెరికా జనరిక్స్ మార్కెట్‌లో స్వల్ప కాలికంగా చూస్తే సన్ ఫార్మాపై ధరల ఒత్తిడి కొనసాగుతుందని భావిస్తున్నట్టు దిలీప్ శాంఘ్వి తెలిపారు. ‘మా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మా కంపెనీ వ్యాపారం సహేతుక వృద్ధిని పొందుతుందని మేము అంచనా వేస్తున్నా ం. అయితే, కరెన్సీ విలువలో అస్థిరత్వం ఎల్లవేళలా ఒక రిస్క్‌గానే కొనసాగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. సన్ ఫార్మా తన ప్రపంచ ప్రత్యేక వ్యాపారంలో దూకుడుగా ముందుకు సాగే ప్రక్రియలో ఉంద ని వెల్లడించారు. తమ కంపెనీకి చెందిన కొన్ని ప్రత్యేక ఉత్పత్తులను 2018-19లో అమెరికాలో వాణిజ్యపరంగా విక్రయించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.