బిజినెస్

50 ఏళ్ల క్రితమే.. కరెన్సీ నోట్‌పై గాంధీ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గాంధీజీ శత జయంతి సందర్భంగా మొట్టమొదటి సారిగా మహాత్ముని చిత్రం వంద రూపాయల నోటుపై సుమారు 50 సంవత్సరాల క్రితమే దర్శనమిచ్చింది. మనకు స్వాతంత్య్రం వచ్చిన 1947 తర్వాత అప్పటివరకు ఉన్న బ్రిటీష్ రాజు చిత్రం స్థానంలో మహాత్ముడి చిత్రాన్ని ప్రవేశపెట్టారు. అయితే మహాత్ముని చిత్రాన్ని ఉంచడంలో ప్రభుత్వం కొంత తర్జనభర్జన పడుతున్న సమయంలో బ్రిటీష్ రాజు చిత్రం స్థానంలో మూడు సింహాల బొమ్మను ఉంచారు. 1969లో రిజర్వ్ బ్యాంకు వంద రూపాయల నోటుపై గాంధీ చిత్రాన్ని ముద్రించి విడుదల చేసింది. సేవాగ్రామ్ ఆశ్రమం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా గాంధీ కూర్చుని ఉన్న చిత్రం అది. ఈ చిత్రంతో 1987 వరకు కరెన్సీ నోట్లు వెలువడ్డాయి. అయితే 500 నోట్లు విడుదలైన తర్వాత అదే సంవత్సరం అక్టోబర్‌లో గాంధీ నవ్వుతూ ఉన్న చిత్రం ఆ నోట్లపై దర్శనమిచ్చింది. తర్వాత అన్ని రకాల డినామినేషన్ల నోట్లపై గాంధీ చిత్రాన్ని ముద్రిస్తూ వచ్చారు. గాంధీ చిత్రం నోట్లపై ముద్రించకముందు కరెన్సీ నోట్లపై రకరకాల బొమ్మలు, డిజైన్లు దర్శనమిచ్చేవి. 1949లో రూపాయి నోట్‌పై అశోక స్థూపం, 1953లో హిందీని ప్రముఖంగా ముద్రించారు. తర్వాత 1954లో వెయ్యి, ఐదు వేలు, పది వేల రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెట్టారు. వెయ్యి రూపాయల నోటుపై తంజావూర్ దేవాలయం, ఐదు వేల నోట్‌పై గేట్‌వే ఆఫ్ ఇండియా, పదివేల నోట్‌పై మూడు సింహాలతో ఉన్న అశోకుడి స్థూపం చిత్రాలు ఉండేవి. 1978లో ఈ పెద్దనోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. 1980 తర్వాత నోట్ల ముద్రణలో విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు నోట్లపై చిత్రాల శైలి కూడా మారింది. సైన్స్, టెక్నాలజీ అంశాలకు వీటిలో ప్రాధాన్యత ఇచ్చేవారు. రెండు రూపాయలపై ఆర్యభట్ట ఉపగ్రహం, రూపాయి నోట్‌పై ఆయిల్ రిగ్, ఐదు రూపాయలపై వ్యవసాయంలో యాంత్రీకరణ, 20, 10 నోట్లపై కోణార్క్ చక్రం, నెమలి చిత్రాలకు స్థానం కల్పించారు. నోట్ల ముద్రణలో సైతం రెపోగ్రాఫిక్, సెక్యూరిటీ ఫీచర్లు కొత్తవి ఏర్పాటు చేశారు.