బిజినెస్

రూ.1,470 కోట్లు సేకరించిన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఆస్తులను తనఖా పెట్టుకొని రుణాలు ఇచ్చే పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) ద్వారా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,470 కోట్లు) సేకరించింది. దేశంలోని గృహ రుణ కంపెనీలు ఈసీబీ పద్ధతిలో ఏటా 750 మిలియన్ డాలర్ల వరకు అప్పులు తీసుకునేందుకు ఈ సంవత్సరం ఆర్‌బీఐ అనుమతించింది. దీంతో ఈసీబీ మార్గంలో 200 మిలియన్ డాలర్ల విదేశీ రుణాలను తీసుకున్నట్టు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిధులను సాధారణ వ్యాపార కార్యకలాపాల కోసం వినియోగించడం జరుగుతుందని ఆ సంస్థ వెల్లడించింది. తీసుకున్న విదేశీ రుణం చెల్లింపు గడువు అయిదు సంవత్సరాల వరకు ఉన్నందున ఈ నిధులు తమ సంస్థ ద్రవ్యలభ్యతను పెంచడమే కాకుండా తమ ఆస్తులు అప్పుల నిర్వహణ (ఏఎల్‌ఎం) సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ వివరించింది.