బిజినెస్

అయిదో వారమూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం బలహీనపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ భారీగా 1,850.15 పాయింట్లు (5.10 శాతం) పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 614 పాయింట్లు (5.50 శాతం) దిగజారింది. రూపాయి విలువ పతనం, ప్రపంచ మార్కెట్‌లో అధిక ముడి చమురు ధరలు ఈ వారంలో ప్రధానంగా దేశీయ మార్కెట్ల ధోరణిని ప్రభావితం చేశాయి. చివరి రోజయిన శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన ద్రవ్య విధాన సమీక్షలో అనూహ్యంగా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడంతో పాటు రూపాయి విలువ పతనాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మదుపరుల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో చివరి రోజు దేశీయ మార్కెట్ కీలక సూచీలు మరింత పతనమయ్యాయి.
గత వారం ఆర్థిక మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్య ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంక్షోభం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచింది. అయితే, ఆర్థిక మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్య లేకుండా చూస్తామని ఆర్‌బీఐ ఇచ్చిన భరోసా, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను గాడిన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ఈ వారం తొలి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ బలపడింది.
క్రితం వారంలో మూడు రోజుల పాటు చవిచూసిన నష్టాలకు తెరదించి, సోమవారం మార్కెట్ కీలక సూచీలు పుంజుకున్నాయి. సెనె్సక్స్ 299 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్ల చొప్పున బలపడ్డాయి. రెండో రోజు మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మిగతా మూడు రోజులూ మార్కెట్‌పై బేర్ పట్టుయే కొనసాగింది. బుధవారం రూపాయి విలువ సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయికి పతనం కావడంతో పాటు అధిక ముడి చమురు ధరల వల్ల ఐటీ, ఆటో, టెలికం రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెనె్సక్స్ 550 పాయింట్లు, నిఫ్టీ 299 పాయింట్ల చొప్పున పడిపోయాయి. గురువారం మరింత దిగజారుతూ సెనె్సక్స్ 806 పాయింట్లు, నిఫ్టీ 259 పాయింట్ల చొప్పున పడిపోయాయి. రూపాయి పతనం, అధిక ముడి చమురు ధరలు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాలతో పాటు రూపాయి పతనాన్ని నిరోధించడానికి ఆర్‌బీఐ తన ద్రవ్య విధాన సమీక్షలో ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడంతో చివరి రోజు శుక్రవారం కూడా మార్కెట్ల పతనం కొనసాగింది. సెనె్సక్స్ 792 పాయింట్లు, నిఫ్టీ 282 పాయింట్ల చొప్పున పడిపోయాయి.