బిజినెస్

బడా కంపెనీలకు భారీ నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న బలహీనమయిన ధోరణి పలు కంపెనీల మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. దేశంలో ని పది కీలక కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శు క్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 2,55,995 కోట్లు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటె డ్ (రిల్) అత్యధికంగా నష్టపోయింది. రిల్ మార్కె ట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ. 1,32,061.4 కోట్లు పడిపోయి, రూ. 6,65,441.16 కోట్లకు చేరిం ది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ విలువ రూ. 31,164.6 కోట్లు పడిపోయి, రూ. 8,05,187.65 కోట్లకు చేరింది. ఐటీసీ ఎంక్యాప్ రూ. 23,932.94 కోట్లు తగ్గి రూ. 3,39,284.67 కోట్లకు చేరింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 17,091.72 కోట్లు పడిపోయి, రూ. 2,00,874.28 కోట్లకు చేరుకుంది. మారుతి సుజుకి ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13,821.67 కోట్లు పడిపోయి, రూ. 2,08,223.79 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంక్యాప్ రూ. 11,629.51 కోట్లు తగ్గి, రూ. 5,33,340.93 కోట్ల కు చేరుకుంది. హెచ్‌యూఎల్ మార్కెట్ విలువ రూ. 10,433.61 కోట్లు పడిపోయి, రూ. 3,37,566.18 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ. 6,812.89 కోట్లు పడిపోయి, రూ. 2,90,520.19 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ. 6,425.7 కోట్లు తగ్గి, రూ. 2,30,075.87 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 2,621.03 కోట్లు పడిపోయి, రూ. 3,15,331.73 కోట్లకు చేరుకుంది. ఈ పది కంపెనీలలో మార్కెట్ విలువ ఆధారంగా టీసీఎస్ అగ్ర స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో వరుసగా రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, మారుతి, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉన్నాయి.