బిజినెస్

మూడు రోజుల నష్టాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 8: వరుసగా మూడు రోజుల పాటు ఎదురైన నష్టాలకు తెరపడింది. భారత స్టాక్ మార్కెట్ సోమవారం కోలుకోవడంతో సెనె్సక్స్ 97.39 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ సైతం ఊపిరి పీల్చుకుంది. 31.60 పాయింట్లు మెరుగుపడింది. నిజానికి సోమవారం స్టార్ మార్కెట్‌లో లావాదేవీలు అస్థిరంగా కొనసాగాయి. ఆరంభంలో మండగొడిగా సాగినప్పటికీ, క్రమంగా కొనుగోళ్లతో పోటీపడుతూ అమ్మకాలు కూడా పెరగడంతో సూచికల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. ఒకానొక దశలో 30-షేర్ సెనె్సక్స్ 34,636.45 వరకూ చేరింది. దేశీయ మదుపరులు స్థిర కొనుగోళ్లను కొనసాగించడమే ఇందుకు కారణం. అయితే, ఆతర్వాత మళ్లీ అమ్మకాల్లో పెరుగుల నమోదు కావడంతో సెనె్సక్స్ తగ్గింది. స్థూలంగా చూస్తే, 97.39 పాయింట్లు (0.28 శాతం) పెరిగి, సోమవారం లావాదేవీలు ముగిసే సమయానికి 34,474.38 పాయింట్లకు చేరింది. నిఫ్టీ సైతం ఇదే పంథాలో నడిచింది. మొత్తం మీద 31.60 పాయింట్లు (0.31 శాతం) మెరుగుపడడంతో 10,348.05 పాయింట్ల వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజిలో ఎస్ బ్యాంక్, రిలయన్స్, హీరో మోటో, కోటక్ మహీంద్ర, ఎస్‌బీఐ తదితర షేర్లు లాభపడగా, వేదాంత, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, టాటా మోటార్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి. అదే విధంగా నిఫ్టీలో హెచ్‌పీసీఎల్, ఎస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, హీరో మోటో లాభపడితే, వేదాంత, హిండాల్కో, టెక్ మహీంద్ర, బజాజ్ ఫిన్, విప్రో తదితర కంపెనీలు నష్టాన్ని చవిచూశాయి.