బిజినెస్

42 పైసలు పుంజుకున్న రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 24: రూపాయి మారకపు విలువ క్రమంగా బలపడుతున్నది. డాలర్‌కు రూ పాయి మారకం బుధవారం 42 పైసలకు పెరిగింది. దీనితో డాలర్ విలువ 73.18 రూపాయలకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ మాదిరిగానే రూపాయి పుంజుకోవడానికి ముడి చమురు ధరల్లో తగ్గుదల, ఆసియా మార్కెట్ తీరుతెన్నులు దోహదపడ్డాయి. విదేశీ మారకం ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల్లో 42 పైసలు పెరగడంతో, చివరిలో మారక వేగం పెరిగింది. ముడి చమురు ధర 4.37 శాతం తగ్గడం రూపాయికి లాభించిందని చెప్పాలి. మొత్తం మీద బుధవారం 340.35 కోట్ల రూపాయల విలువైన విదేశీ ఫండ్ షేర్లు అమ్ముడయ్యాయి. ఇందులో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు కొన్న షేర్ల విలువ రూ.116.41 కోట్లు కావడం గమనార్హం.