బిజినెస్

ఊపందుకున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 24: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో బుధవారం లావాదేవీలు ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో తగ్గుదల స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. దీనితోపాటు దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడం, ఆసియా మార్కెట్ సూచీల్లో సానుకూలత కనిపించడం వంటి అంశాలు కూడా సెనె్సక్స్ పెరగడానికి కారణమయ్యాయి. రోజు మొత్తం మీద ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు కనిపించినప్పటికీ, మొత్తం మీద 186.73 పాయింట్లు మెరుగుపడిన సెనె్సక్స్ 34,033.96 పాయింట్ల వద్ద ముగిసింది. కొంతకాలంగా పతనాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్ కోలుకోవడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. ఇదే ఒరవడి కొనసాగితే, ఈ వారాంతంలోగా సెనెక్స్ మరోసారి 35,000 బెంచ్ మార్క్‌ను అధిగమించే అవకాశాలు లేకపోలేదు. భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, లార్సెన్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఐటీసీ తదితర కంపెనాలు లాభపడగా, ఎస్ బ్యాంక్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, హీరో మోటో, ఎన్‌టీపీసీ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ కూడా బుధవారం లాభాల బాటలో నడిచింది. 77.95 పాయింట్లు మెరుగుపడిన నిఫ్టీ 10,224.75 పాయింట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, హిండాల్‌కో షేర్లు లాభాలను ఆర్జించాయి. ఎస్ బ్యాంక్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.