బిజినెస్

బంగారం రికార్డు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బంగారం ధర బుధవారం ఈ ఏడాదిలోనే అధికంగా నమోదైంది. పది గ్రాముల బంగారం ధర మొదటిసారి 32,500 రూపాయలకు చేరింది. ఏకంగా 150 రూపాయలు పెరగడంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. దేశీయం ఉండే జ్యుయెలరీ వ్యాపారులతోపాటు ప్రజలు కూడా బంగారం కొనడానికి మొగ్గు చూపించారు. విదేశీ కంపెనీలు కూడా స్వర్ణంపై దృష్టి పెట్టాయి. ఫలితంగా ఈ ఏడాది మొత్తంలోనే అత్యధిక ధర పలికింది. రూపాయి మారకపు విలువ కొంత పెరిగినప్పటికీ, మదుపరుల్లో ఇంకా సందేహాలు తీరడం లేదన్న విషయం బంగారానికి ఏర్పడి డిమాండ్ స్పష్టం చేస్తున్నది. అయితే, దీపావళి పండుగ డిమాండ్ కూడా ఈ అరుదైన లోహం ధర పెరగడానికి ఒక కారణమైంది. సోమవారం 32,330 రూపాయలు పలికిన పది గ్రాముల బంగారం ధర మంగళవారం మరికొంత పెరిగి, 32,350 రూపాయలకు చేరింది. బుధవారం కూడా అదే ఊపు కనిపించింది. ఫలితంగా 32,500 రూపాయల రికార్డు ధర పలికింది. ఇలావుంటే, సాధారణంగా బంగారంతోపాటే పెరిగే వెండి ధర బుధవారం అనూహ్యంగా తగ్గింది. కిలో వెండి 20 రూపాయలు తగ్గి, 39,730 రూపాయలకు చేరింది.
నగల ఎగుమతి ఆశాజనకం
బంగారు ఆభరణాల ఎగుమతి ఆశాజనకంగా కనిపిస్తున్నది. గత నెల ఎగుమతులు పెరగడంతో, ఈ నెల కూడా అదే ధోరణి మార్కెట్‌లో కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సెప్టెంబర్ మాసంలో 786.77 మిలియన్ డాలర్ల విలువ చేసే నగలు ఎగుమతికాగా, సెప్టెంబర్‌లో అది 830.35 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.