బిజినెస్

రెండో రోజూ పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా రెండో రోజు కూడా సెనె్సక్స్ పతనం కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో గురువారం నష్టాల్లో కొనసాగిన లావాదేవీలు శుక్రవారం పుంజుకుంటాయన్న ఆశ శుక్రవారం ఆరంభంలోనే ఆవిరైంది. అటు విదేశీ పెట్టుబడిదారులు, ఇటు దేశీయ మదుపరులు షేర్ల కొనుగోళ్లకు అనాసక్తిని ప్రదర్శించడంతో స్టాక్ మార్కెట్ మందగొడిగా కొనసాగింది. క్రమంగా షేర్ల అమ్మకాలు పెరగడంతో పాయింట్ల పతనం కొనసాగింది. చివరికి 340.31 పాయింట్లు కోల్పోయి, 33,349.31 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఏడు నెలల్లో సెనె్సక్స్ ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. ఎప్పటి మాదిరిగానే ముడి చమురు ధర పెరగడం, రూపాయి మారకపు విలువ తగ్గడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అంతార్జతీయ మార్కెట్‌లో కొనసాగిన మాంద్యం బీఎస్‌ఈని కూడా కుదిపేసింది. ఇంట్రా డేలో డాలర్‌కు రూపాయి విలువ 73.45 రూపాయలుగా నమోదైంది. ద్రవ్య లబ్ధతపై పెరుగుతున్న అనుమానాలు కూడా ఈ పతనానికి ఒక కారణమని అంటున్నారు. మొత్తం మీద వివిధ అంశాలు ప్రభావం చూపడంతో, సెనె్సక్స్ వరుగా రెండో రోజు కూడా నష్టాలను చవిచూసింది. ట్రేడింగ్‌లో సెనె్సక్స్ ఒకానొక సమయంలో 33,776.80 పాయింట్లకు చేరుకుంది. అదే విధంగా అత్యంత కనిష్టంగా 33,298.43 పాయింట్లకు పతనమైంది. చివరికి 33,349.31 పాయింట్ల వద్ద ముగిసింది.
సెనె్సక్స్‌తోపాటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో కూడా లావాదేవీలు షేర్ల విలువ పతనంవైపే సాగాయి. ఫలితంగా నిఫ్టీ 94.90 పాయింట్లు కోల్పోయి 10,030 పాయింట్లకు పడిపోయింది.