బిజినెస్

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 29: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వరుస నష్టాల ఊబి నుంచి కోలుకొని, భారీ లాభాలను ఆర్జించింది. బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల పంట పండించడంతో, సెనె్సక్స్ మెరుగుపడింది. గత వారం నష్టాలతో ముగిసిన బీఎస్‌ఈ లావాదేవీలు కొత్త వారం లాభాలతో మొదలుకావడం మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. వివిధ అంశాలతోపాటు, ద్రవ్య లబ్ధతను పెంచడానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు కూడా సెనె్సక్స్ కుదుటపడేందుకు సహకరించాయి. సోమవారం నాటి లావాదేవీలు ముగిసే సమయానికి సెనెక్స్ 718.09 పాయింట్లు (2.15 శాతం) మెరుగుపడి, 34,067.40 పాయింట్ల వద్ద ముగిసింది.
బ్యాంకింగేతర సంస్థలు ద్రవ్య లబ్ధత కొరతతో అల్లాడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా 40,000 కోట్ల రూపాయల కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచాలని ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. కాగా, బ్యాంకింగ్ స్టాక్స్ అసాధారణ రీతిలో దూసుకెళ్లగా, అన్నిటికంటే ఎక్కువగా ఐసీఐసీ బ్యాంక్ లాభాల పంట పండించింది. ఈ బ్యాంక్ షేర్లు ఒక్కసారిగా 11 శాతం పెరిగడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 119.55 కోట్ల రూపాయల నష్టాన్ని ఐసీఐసీ బ్యాంక్ ప్రకటించింది. అయితే, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 1,204 కోట్ల రూపాయల ఏకీకృత లాభం రావడంతో, ఈ నష్టం 42 శాతంగా నమోదైంది. నష్టాల నుంచి ఒక్కసారిగా బయటపడి, లాభాల బాటలో ఐసీఐసీఐ స్టాక్స్ పరుగులు తీయగా, ఎస్‌బీఐ కూడా మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ బ్యాంక్ షేర్లు 8.04 శాతం లాభపడ్డాయి. అదే విధంగా అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టీసీఎస్ తదితర సంస్థ స్టాక్స్ సగటున 7.33 శాతం చొప్పున లాభాలను పండించాయి. బ్యాంకింగ్ రంగం ఎక్కువ లాభపడిన సోమవారం నాటి లావాదేవీలు 33,522.64 పాయింట్ల వద్ద మొదలై, అనూహ్య వేగంగా ముందుకు దూసుకెళ్లి, 34,067.40 పాయింట్లవద్ద ముగియడం గమనార్హం.
జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సైతం సోమవారం లాభాల బాటలో సాగింది. 220.85 పాయింట్లు (2.20 శాతం) పెరిగిన నిఫ్టీ 10,074.25 పాయింట్ల వద్ద ముగిసింది. అప్‌ట్రెండ్ చివరి వరకూ కొనసాగగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ సగటున 2.26 శాతం లాభాలను ఆర్జించాయి. ఫోరెక్స్‌లో డాలర్ 73.43 రూపాయలుగా ట్రేడ్ అయింది. సోమవారం నాటి గణాంకాలను పరిశీలిస్తే, ఫారిన్ ఫండ్స్ 1,356.66 కోట్ల రూపాయల విలువగల షేర్ల అమ్మకాలు జరిగితే, దేశీయ మదుపరులు 1,875.89 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్ నష్టాల నుంచి బయటపడి, లాభాలను ఆర్జించడానికి దేశీయ మదుపరుల కొనుగోళ్లే కీలకమని చెప్పాలి.