బిజినెస్

మార్పులేని బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర ఎలాంటి మార్పులకు లోనుకాలేదు. 10 గ్రాముల బంగారం 32,550 రూపాయలుగానే కొనసాగింది. డిమాండ్ స్వల్పంగా తగ్గడంతోపాటు, అంతర్జాతీయ సూచీలు బలహీన పడడంతో, బంగారం దూకుడుకు కళ్లెం పడింది. కాగా, బంగారంతోపాటు పెరుగుతూ వచ్చినప్పటికీ, గత వారం చివరిలో కొంత పతనమైన కిలో వెండి ధర సోమవారం మరో 100 రూపాయలు తగ్గింది. 39,600 ధర వద్ద మొదలైన బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర 39,500 రూపాయల వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉండడమే బంగారం ధరలో మార్పు లేకపోవడానికి, వెండి ధర తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశే్లషకులు పేర్కొంటున్నారు.