బిజినెస్

టాప్ 50లో స్థానం సంపాదించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రపంచంలోనే మొదటి 50 అత్యంత ముఖ్యమైన పెట్టుబడులు పెట్టేందుకు అనువైన దేశాల జాబితాలో త్వరలోనే భారత్ చేరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ 23 స్థానాలు దాటి 77వ స్థానంలో నిలిచినట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల ఎన్డీఏ-బీజేపీ పాలనలో భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 65 స్థానాలను దాటిందన్నారు. దేశాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్లడంలో యూపీఏ సర్కార్ విఫలమైందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్ స్థానం 132 నుంచి 142 స్థానానికి యూపీఏ-2హయాంలో చేరిందన్నారు. ఈవివరాలను బ్లాగ్‌లో అరుణ్ జైట్లీ వివరించారు. పన్నుల చెల్లింపు, జీఎస్‌టీ సంస్కరణలు, దివాలా ప్రక్రియ చట్టం అమలు, ఎన్‌సీఎల్‌టీ ఏర్పాటు వంటి అంశాల వల్ల భారత్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయన్నారు. భారత్ ఇంకా అభివృద్ధిచెందాల్సిన అవసరం ఉందని, ఈ ర్యాంకుతో సంతృప్తి లేదన్నారు. అనేక నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కరణలను వేగవంతం చేయడమే కాకుండా,జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మంచి ర్యాంకు వచ్చిందన్నారు. మొదటి 50 స్థానాల్లో చోటు దక్కాలంటే మరో 27 మెట్లు ఎక్కాల్సి ఉందన్నారు. అసాధ్యమైన అంశాలను సాధ్యం చేయడమే మోదీ లక్ష్యమన్నారు. పదేళ్ల యూపీఏ హయాంలో అవినీతి విస్తరించిందన్నారు. గతంలో పెట్టుబడీదారులు భారత్‌కు వచ్చేందుకు వెనకాడేవారన్నారు. ఈ రోజు పరిస్థితి మారిందన్నారు. ఈ ఏడాది న్యూజిలాండ్, సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్, అమెరికా, చైనా దేశాలు మొదటి 50లో ఉన్నాయన్నారు.